మాజీ టీమిండియా సారథి విరాట్ కోహ్లీకి టైమ్ సరిగ్గా లేనట్లుంది. అతనికి కాలం కలిసిరాలేదు. కోహ్లీకి బ్యాటింగ్ వైఫల్యాలు కొనసాగుతున్నాయి. ఇటీవల ఇంగ్లండ్‌తో బర్మింగ్ హామ్‌లో జరిగిన రీషెడ్యూల్డ్ టెస్టు రెండు ఇన్నింగ్స్ ల్లోనూ కోహ్లీ రాణించింది లేదు.
తొలి ఇన్నింగ్స్ లో 11, రెండో ఇన్నింగ్స్ లో 20 పరుగులు చేశాడు. ఇప్పుడు ఇంగ్లండ్ తో టీ20 సిరీస్‌కు టీమిండియా సమాయత్తమవుతోంది.
ఈ టీ20 సిరీస్ లో గనుక రాణించకపోతే కోహ్లీ విషయంలో సెలెక్టర్లు కఠిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ టీ20 సిరీస్‌లో రాణించడంపైనే టీ20 వరల్డ్ కప్‌కు కోహ్లీ ఎంపిక ఆధారపడి ఉంది. టీ20 వరల్డ్ కప్ ఈ ఏడాది అక్టోబరులో జరగనుంది. కోహ్లీ విషయంలో సెలెక్టర్లు ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.
ఈ నెలలో వెస్టిండీస్ తో జరిగే మూడు వన్డేల సిరీస్ కు శిఖర్ ధావన్ నాయకత్వంలో సెలెక్టర్లు జట్టును ప్రకటించారు. రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, జస్ప్రీత్ బుమ్రాలతో పాటు కోహ్లీకి విశ్రాంతి కల్పించారు.