ఢిల్లీ టెస్ట్ మ్యాచ్ : 113 పరుగులకే కుప్పకూలిన ఆస్ట్రేలియా - భారత్ టార్గెట్ 115 రన్స్

ఆదివారం, 19 ఫిబ్రవరి 2023 (12:40 IST)
ఢిల్లీలో టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు 113 పరుగులకే ఆలౌట్ అయింది. రెండో రోజు ఓవర్ నైట్ స్కోరు 61/1తో ఆటను కొనసాగించిన ఆస్ట్రేలియా జట్టు ఇన్నింగ్స్ మూడో రోజైన ఆదివారం పేకమేడలా కుప్పకూలిపోయింది. తొలి ఇన్నింగ్స్‌లో ఒక్క పరుగు ఆధిక్యాన్ని సాధించిన కంగారులు.. రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 113 పరుగులకే ఆలౌట్ అయ్యారు. దీంతో భారత్ ముంగిట 115 పరుగుల స్వల్ప విజయలక్ష్యాన్ని ఉంచింది. 
 
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌ను భారత బౌలర్లలో రవీంద్ జడేజా, అశ్విన్‌లు కుప్పకూల్చారు. వీరిద్దరు కలిసి మొత్తం పది వికెట్లు తీశారు. ఇందులో జడేజా ఏడు, అశ్విన్ మూడు వికెట్లు చొప్పున తీశారు. అలాగే, ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో అత్యధికంగా ట్రావిస్ హెడ్ (43), లబుషేన్ (35) మాత్రమే చెప్పుకోదగిన స్కోరు చేశారు. 
 
ఆ తర్వాత 115 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్... ఒక వికెట్ నష్టానికి 14 పరుగులు చేసింది. రెండో ఓవరల్‌లో ఓపెనర్ కేఎల్ రాహుల్ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి లైయన్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. ప్రస్తుతం రోహిత్, పుజారాలు క్రీజ్‌లో ఉన్నారు. భారత విజయానికి మరో 101 పరుగులు చేయాల్సివుంది. అంతకుముందు ఆస్ట్రేలియా జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులు చేయగా, భారత్ 262 పరుగులు చేసిన విషయం తెల్సిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు