25 మిలియన్ల ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్.. హార్దిక్ పాండ్యా రికార్డ్

సోమవారం, 6 మార్చి 2023 (18:33 IST)
స్టార్ ఇండియన్ అథ్లెట్ హార్దిక్ పాండ్యా 25 మిలియన్ల ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లను చేరుకున్న ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కుడైన క్రికెటర్‌గా నిలిచాడు. సోషల్ మీడియా భారీగా ఫాలోవర్లు కలిగిన హార్దిక్ పాండ్యా.. రఫెల్ నాదల్, రోజర్ ఫెదరర్, మాక్స్ వెర్స్టాపెన్, ఎర్లింగ్ హాలాండ్ వంటి గ్లోబల్ స్టార్‌ల కంటే ఎక్కువ మంది ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లను కలిగి ఉన్నాడు. 
 
ఈ సందర్భంగా హార్దిక్ పాండ్యా కృతజ్ఞతలు తెలిపాడు. తన అభిమానులందరికీ ధన్యవాదాలని చెప్పాడు. హార్దిక్, క్రికెటర్‌కు 29 ఏళ్లు మాత్రమే. అయితే టీమిండియాలో సీనియర్ సభ్యుడు. అంతర్జాతీయ వేదికలతో.. ఐపీఎల్‌లోనూ రాణించాడని సంగతి తెలిసిందే.
 
హార్దిక్ చేతిలో స్పోర్ట్స్ ఎక్విప్‌మెంట్, ఆడియో, డెనిమ్స్, షర్టులు, బ్యాటరీలు, లూబ్రికెంట్లు, ఎనర్జీ డ్రింక్, బిస్కట్‌లు, క్యాజువల్ దుస్తులు, షూస్, బెవరేజ్, పెర్ఫ్యూమ్, మీడియా అండ్ బ్రాడ్‌కాస్ట్ వంటి రంగాల్లో 20కి పైగా బ్రాండ్‌లు ఉన్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు