ఈ నెల 19వ తేదీ ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఐసీసీ వన్డే ప్రపంచ కప్ ఫైనల్ పోటీ భారత్, ఆస్ట్రేలియా క్రికెట్ జట్ల మధ్య జరుగనుంది. ఈ మ్యాచ్‌లో వీక్షణ కోసం ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక ఆహ్వానితుడుగా హాజరుకానున్నారు. చరిత్రాత్మకమైన ఈ మ్యాచ్‌కు అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది.
అయితే, ప్రపంచ విజేత టైటిల్ కోసం జరిగే ఈ పోరును వీక్షించేందుకు స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ హాజరుకానున్నారు. ఈ మ్యాచ్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరవుతారని చెబుతున్నారు. మోదీతో పాటు క్రికెట్ దిగ్గజాలు ఎంఎస్ ధోనీ, కపిల్ దేవ్‌కూడా ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు హాజరుకానున్నారు.
ఈ నెల 19వ తేదీన గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో నరేంద్ర మోడీ స్టేడియంలో ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌లో జరుగనుంది. ఇందులో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ కోసం భారత క్రికెటర్లు అహ్మదాబాద్ నగరానికి చేరుకున్నాయి. గురువారం సాయంత్రం ముంబయి నుంచి బయల్దేరిన టీమిండియా ఆటగాళ్లు, సహాయక సిబ్బందికి అహ్మదాబాద్ ఎయిర్ పోర్టులో ఘనస్వాగతం లభించింది.
విమానాశ్రయం నుంచి ప్రత్యేక బస్సులో ఆటగాళ్లు తమకు కేటాయించిన హోటల్ కు వెళ్లిపోయారు. టీమిండియా ఆటగాళ్లు వస్తున్నారని తెలియడంతో అహ్మదాబాద్‌లో ఎయిర్ పోర్టు నుంచి హోటల్‌కు వెళ్లే రోడ్డుకు ఇరువైపులా అభిమానులు బారులు తీరారు. బస్సులో ఉన్న తమ అభిమాన క్రికెటర్లను చూస్తూ ఆనందంతో నినాదాలు చేశారు. టీమిండియా ఆటగాళ్లు రేపటి నుంచి ప్రాక్టీసు చేయనున్నారు. ఇవాళ రెండో సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాపై గెలిచిన ఆస్ట్రేలియా జట్టు రేపు అహ్మదాబాద్ చేరుకునే అవకాశం ఉంది.