ఇకపోతే.. ఆసీస్‌తో టెస్టు సిరీస్‌లో 2-1 ఆధిక్యాన్ని సాధించిన కోహ్లీ సేన.. నాలుగవ టెస్టులోనూ మెరుగైన ఆటతీరును ప్రదర్శిస్తోంది. గురువారం ఉదయం ఓపెనర్ కేఎల్ రాహుల్ 9 పరుగులకే నిష్క్రమించినా.. ఆ తర్వాత మయాంక్, పుజారాలు రెండవ వికెట్‌కు భారీ భాగస్వామ్యాన్ని అందించారు.
గత మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్సుల్లో 76, 42 పరుగులు చేసి విదేశీ గడ్డపై అత్యధిక పరుగులు చేసినన రెండో భారత క్రికెటర్‌గా నిలిచిన మయాంక్.. నాల్గో టెస్టులోనూ ఆకట్టుకున్నాడు. సిడ్నీలో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 77 పరుగులు సాధించి మరో రికార్డు నెలకొల్పాడు.