కీపర్ రిషబ్ పంత్‌కు కరోనై : మరో స్టాఫ్ మెంబర్‌కు కూడా పాజిటివ్వే...

గురువారం, 15 జులై 2021 (18:31 IST)
భారత క్రికెట్ జట్టు ఇంగ్లండ్ పర్యటనలో ఉంది. అయితే, ఈ జట్టులోని వికెట్ కీపర్ రిషభ్ పంత్‌కు కరోనా వైరస్ సోకినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా జట్టుకు చెందిన ఓ స్టాఫ్ మెంబ‌ర్‌కు కూడా పాజిటివ్‌గా తేలిన‌ట్లు స‌మాచారం. 
 
అత‌నితోపాటు మ‌రో ముగ్గురు కోచింగ్ సిబ్బంది కూడా ప్ర‌స్తుతం ఐసోలేష‌న్‌లో ఉన్నారు. వీళ్లెవ‌రూ టీమ్‌తో క‌లిసి డ‌ర్హ‌మ్ వెళ్ల‌డం లేదు. డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ త‌ర్వాత టీమ్ స‌భ్యులు బ‌యో బబుల్ నుంచి బ‌య‌ట‌కు వెళ్లారు. 
 
కొంద‌రు యూరో ఫుట్‌బాల్ మ్యాచ్‌లు చూడ‌టానికి వెళ్లారు. రిష‌బ్ పంత్ కూడా అలా యూరోకి వెళ్లే క‌రోనా బారిన ప‌డ్డాడు. యూకేలో క‌రోనా కేసులు పెరిగిపోతున్న నేప‌థ్యంలో అంద‌రూ కొవిడ్ ప్రొటోకాల్ పాటించాలని ఇప్ప‌టికే బీసీసీఐ కార్య‌ద‌ర్శి జే షా ప్లేయ‌ర్స్‌కు మెయిల్ కూడా చేశారు. 
 
భారత క్రికెట్ జట్టులో కరోనా కలకలం 
 
భారత క్రికెట్ జట్టులో కలకలం చెలరేగింది. ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ముందు ఇండియ‌న్ టీమ్‌ సభ్యుల్లో ఒకరికి కరోనా పాజిటివ్ అని తేలింది. మొత్తం 23 మంది క్రికెట‌ర్ల బృందంలో ఒక‌రికి క‌రోనా పాజిటివ్‌గా తేలింది. 
 
డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ త‌ర్వాత 20 రోజుల బ్రేక్ దొర‌క‌డంతో ఈ గ్యాప్‌లో ప్లేయ‌ర్స్ యూకేలో సైట్ సీయింగ్‌కు వెళ్లారు. ఆటగాళ్లు యూకేలో త‌లో దిక్కుకు వెళ్లారు. కొంద‌రు వివిధ ప్ర‌దేశాల‌ను చూడ‌టానికి వెళ్ల‌గా.. మ‌రికొంద‌రు యూరో ఫుట్‌బాల్ మ్యాచ్‌లు కూడా చూశారు. 
 
నిజానికి ప్లేయ‌ర్స్ కొవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నా కూడా.. దాని నుంచి పూర్తి ర‌క్ష‌ణ ఉండ‌ద‌ని, యూరో, వింబుల్డ‌న్‌లాంటి టోర్నీల‌కు వెళ్లొద్ద‌ని బీసీసీఐ చెప్పినా కొంద‌రు విన‌లేదు. అప్పుడే స‌ద‌రు ప్లేయ‌ర్ కొవిడ్ బారిన ప‌డ్డాడు. గురువారం టీమంతా డ‌ర్హ‌మ్ వెళ్ల‌నుండ‌గా.. ఆ ప్లేయ‌ర్ మాత్రం టీమ్‌తో పాటు వెళ్ల‌డం లేదు. 
 
డ‌ర్హ‌మ్‌లో టీమిండియా మ‌రోసారి బ‌యోబబుల్‌లోకి వెళ్ల‌నుంది. ఇంగ్లండ్‌తో సిరీస్ ఆగ‌స్ట్ 4న ప్రారంభ‌మ‌వుతుంది. ఒక ప్లేయ‌ర్ క‌రోనా బారిన ప‌డిన మాట నిజ‌మే. అయితే అత‌నికి పెద్ద‌గా ల‌క్ష‌ణాలేమీ లేవు. ప్ర‌స్తుతం అత‌డు క్వారంటైన్‌లో ఉన్నాడు. టీమ్‌తో కలిసి డ‌ర్హ‌మ్ వెళ్ల‌డం లేదు అని బీసీసీఐ అధికారి ఒక‌రు పీటీఐకి వెల్ల‌డించారు. అయితే, కరోనా వైరస్ సోకిన క్రికెట్ ఆటగాడి పేరు మాత్రం ఎవ‌రూ బ‌య‌ట‌పెట్ట‌లేదు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు