భారత క్రికెట్ జట్టు సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లింది. డిసెంబరు పదో తేదీ నుంచి జనవరి ఏడో తేదీ వరకు ఈ క్రికెట్ టూర్ జరుగనుంది. మొత్తం మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్ట్ మ్యాచ్‌లను ఆడనుంద. ఈ మూడు ఫార్మెట్లకు మూడు వేర్వేరు జట్లను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ప్రకటించింది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, షమీ, బుమ్రాలు పరిమితి ఓవర్ల సిరీస్‌కు దూరంగా ఉండనున్నారు. అయితే, టెస్ట్ మ్యాచ్‌లకు మాత్రం అందుబాటులో ఉంటారు.
ఇదిలావుంటే, భారత టీ20 జట్టుకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా నియమించారు. అలాగే, వన్డేలకు కేఎల్ రాహుల్ నాయకత్వం వహిస్తాడు. టెస్టుల్లో టీమిండియాను రోహిత్ శర్మ నడిపించనున్నాడు. ఈ సుదీర్ఘ పర్యటన టీ20 సిరీస్‌తో ప్రారంభం అవుతోంది. డిసెంబరు పదో తేదీ ఆదివారం డర్బన్‌లోని కింగ్స్ మీడ్ స్టేడియంలో టీమిండియా, దక్షిణాఫ్రికా జట్లు తొలి టీ20లో తలపడనున్నాయి. భారత్ - సౌతాఫ్రికా జట్ల క్రికెట్ షెడ్యూల్ వివరాలను పరిశీలిస్తే,
రెండో వన్డే- డిసెంబరు 19 (కెబెరా)
మూడో వన్డే- డిసెంబరు 21 (పార్ల)
టెస్టు సిరీస్ షెడ్యూల్...