ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 180 పరుగులకు చేసింది. రోహిత్ శర్మ 17, లోకేశ్ రాహుల్ 61, శ్రేయాస్ అయ్యర్ 24, ధోనీ 39, మనీష్ పాండే 32 పరుగులు చేశారు.
ఆ తర్వాత 181 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక జట్టును భారత బౌలర్ల ధాటికి చేతులెత్తేసింది. ముఖ్యంగా, చాహల్, హార్ధిక్ పాండ్యాల బౌలింగ్ దెబ్బకు శ్రీలంక టాపార్డర్ పేకమేడలా కుప్పకూలింది.
శ్రీలంక బ్యాట్స్‌మన్‌లలో ఉపుల్ తరంగ చేసిన 23 పరుగులే అత్యధికం. కుశాల్ పెరీరా 19, డిక్‌వెల్లా 13, చమీర 12 పరుగులు చేశారు. మిగతా బ్యాట్స్‌మెన్ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్ 4, హార్ధిక్ పాండ్యా 3, కుల్దీప్ యాదవ్ 2, జయ్‌దేవ్ ఉనద్కత్ 1 వికెట్ తీసుకున్నారు.