ఈ రోజు ఓ స్పెషల్ వీడియోతో ది గర్ల్ ఫ్రెండ్ సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు. నవంబర్ 7న ఈ చిత్రాన్ని హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రేమికులుగా మనం ఒకే టైపా, ఒకరికొకరం ఎంతవరకు కరెక్ట్ ?, రకరకాల కారణాలతో కలిసే ప్రేమికుల్లో ఎంతమందికి ఈ క్లారిటీ ఉంటుంది ?. మీకు ఉందా ?, నవంబర్ 7న థియేటర్స్ కు రండి డిస్కస్ చేద్దాం..' అంటూ ప్రేక్షకుల్ని రశ్మిక, దీక్షిత్ ఇన్వైట్ చేస్తున్న రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ వీడియో ఇన్నోవేటివ్ గా ఉండి ఆకట్టుకుంటోంది.