దీనిపై ఆ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ స్పందిస్తూ, తమ జట్టు విజయానికి దగ్గరగా వచ్చి ఓటమి పాలవడం తనను తీవ్రంగా కలచివేస్తోందన్నారు. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓటమి పాలవడం బాధగా ఉందన్నాడు. విజయం ఖాయమన్న మ్యాచులను ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నట్టు తెలిపారు.
అదేసమయంలో తమ జట్టు బ్యాటింగ్ తీరుపైనా రోహిత్ శర్మ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ముఖ్యంగా, మంచి స్కోర్లు సాధించలేకే రెండు మ్యాచుల్లోనూ ఓడిపోయినట్టు చెప్పాడు. ఇంకొన్ని పరుగులు చేయాల్సి ఉండేందని, తమ బ్యాట్స్‌మెన్ ఇంకొంత మెరుగ్గా ఆడి ఉండాల్సిందని అన్నాడు.
ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌లలో బౌలర్లు చక్కగా బౌలింగ్ చేసినా, బ్యాట్స్‌మెన్ వైఫల్యమే తమ ఓటమికి ప్రధాన కారణమన్నాడు. బౌలర్లు రాణించారని, గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నించారని ప్రశంసించాడు. ఒకానొక దశలో విజయం తమ చేతుల్లోకి వచ్చినా అదృష్టం కలిసి రాకే ఓడిపోయినట్టు రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.