ధోనీ కెప్టెన్సీ వల్లే అదంతా జరిగింది.. కోహ్లీ వచ్చాక దున్నేశాడు..

శనివారం, 4 జనవరి 2020 (12:15 IST)
టీమిండియా జట్టులో ప్రస్తుతం పేస్ విభాగం రాటు దేలడంపై భారత పేస్‌ ఎటాక్‌లో పిల్లర్‌గా వున్న ఇషాంత్ శర్మ తనదైన శైలిలో సమాధానమిచ్చాడు. తనకు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సమయంలో తనకు ఎక్కువగా అవకాశాలు రాకపోవడాన్ని పరోక్షంగా ప్రస్తావించాడు. అసలు ఫాస్ట్‌ బౌలర్లకు నిలకడగా ధోని ఎప్పుడు అవకాశాలు ఇచ్చాడంటూ ఇషాంత్‌ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.
 
ధోనీ కెప్టెన్సీలో ఫాస్ట్ బౌలర్లకు ఎక్కువగా రొటేషన్ పద్ధతిలో అవకాశాలు మాత్రమే వచ్చేవి.. ధోనీ ఎప్పుడూ ఫాస్ట్ బౌలర్లను మార్చుతూనే వుండేవాడు. అది అప్పట్లో ఏ ఒక్క ఫాస్ట్‌ బౌలర్‌కి ఉపయోగపడలేదు. ఇలా చేయడం ద్వారా తమలో నిలకడ లోపించేది. 
 
నిలకడను సాధించడానికి ధోనీ అవలంబించిన పేసర్ల రొటేషన్ పద్ధతి ఉపయోగం లేకుండా పోయింది. ఇలా చేయడం వల్ల తమలో అనుభవలేమి ఎక్కువగా కనబడేదని ఇషాంత్ తెలిపాడు. ధోని అవలంభించిన రొటేషన్‌ విధానంతో మాకు లాభం చేకూరలేదని ఇషాంత్ పేర్కొన్నాడు. 
 
ఇక విరాట్‌ కోహ్లి కెప్టెన్సీలో జట్టు పూర్తి స్థాయిలో మారిపోయిందన్నాడు. ఫాస్ట్‌ బౌలర్లకు పెద్దపీట వేయడంతో మనం కూడా బలమైన పేస్‌ ఎటాక్‌ ఎదిగామన్నాడు. కోహ్లి నేతృత్వంలో ఫాస్ట్‌ బౌలర్లు విశేషంగా రాణించడానికి వారికి నిలకడగా అవకాశాలు రావడమేనన్నాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు