అమరావతిలో ఇంటర్నేషనల్ మోడల్ స్కూల్.. నారా లోకేష్‌ ప్రధాన ప్రాజెక్ట్ ఇదే

సెల్వి

సోమవారం, 27 అక్టోబరు 2025 (16:16 IST)
Government International Model School
ఆంధ్రప్రదేశ్ తన తొలి ప్రభుత్వ అంతర్జాతీయ మోడల్ స్కూల్‌ను అమరావతిలో ఏర్పాటు చేయనుంది. మంగళగిరిలోని ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న జెడ్పీహెచ్ఎస్ నిడమర్రు క్యాంపస్‌ను అత్యాధునిక విద్యా కేంద్రంగా మారుస్తున్నారు. ఈ కొత్త పాఠశాల అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది. ఇందులో స్విమ్మింగ్ పూల్, ల్యాబ్ బ్లాక్, ఇండోర్ స్టేడియం, యాంఫిథియేటర్, భోజన సౌకర్యాలు ఉంటాయి. 
 
200 మీటర్ల రన్నింగ్ ట్రాక్ కూడా నిర్మాణంలో ఉంది. ఈ నిర్మాణం త్వరలో పూర్తవుతుంది. ఈ పైలట్ ప్రాజెక్ట్ విజయవంతం అయిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి పాఠశాలలను ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ సర్కారు రంగం సిద్ధం చేస్తుంది. 
 
రాష్ట్ర విద్యా వ్యవస్థను ఆధునీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్న ఉన్నత విద్యా మంత్రి నారా లోకేష్‌ ప్రధాన ప్రాజెక్ట్ ఇది. రూ.15 కోట్ల పెట్టుబడితో, ఈ పాఠశాల ఆంధ్రప్రదేశ్‌లోని భవిష్యత్ ప్రభుత్వ సంస్థలకు ఒక బెంచ్‌మార్క్‌గా మారుతుందని భావిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు