భారత స్టార్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా త్వరలో పెళ్లి పీటలెక్కనున్నాడు. పెళ్లికోసమే బుమ్రా ఇంగ్లండ్‌తో జరిగే చివరి టెస్ట్ నుండి మాత్రమే కాదు వన్డే, టీ20 సిరీస్ నుంచి తప్పుకుంటున్నట్లు బీసీసీకి చెప్పాడని సమాచారం.
కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్‌లో చాలా మంది భారత ఆటగాళ్లు పెళ్లి పీటలు ఎక్కిన సంగతి తెలిసిందే. తాజాగా జస్‌ప్రీత్ బుమ్రా త్వరలో పెళ్లి చేసుకోనున్నాడని వార్తలు వస్తున్నాయి. బూమ్రా పెళ్లి కేవలం కొద్దిమంది కుటుంబసభ్యులు, ప్రైవేట్ కార్యక్రమంలాగా నిర్వహించాలని భావిస్తున్నట్టు తెలిసింది. అందుకే వధువు ఎవరనే విషయాన్ని ఇంకా వెల్లడించలేదు. త్వరలో పెళ్లికూతురు ఎవరనే విషయాలు బయటకు రానున్నాయి