ఐపీఎల్ 2023కి కేన్ మామ దూరం.. ఎందుకో తెలుసా?

ఆదివారం, 2 ఏప్రియల్ 2023 (13:52 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023 సీజన్ ప్రారంభమైంది. ప్రారంభ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో సీఎస్కే జట్టు చేజేతులా ఓడింది. తొలి మ్యాచ్‍‌లో కీలక ప్లేయర్ అయిన కేన్ విలియమ్సన్ గాయపడ్డారు. రుతురాజ్ గైక్వాడ్ కొట్టిన భారీ సిక్సర్‌ను అడ్డుకునే ప్రయత్నంలో కేన్ మామ ప్రయత్నించి విఫలమయ్యాడు. ఈ క్రమంలో ఆయన కాలికి గాయమైంది. బౌండరీ లైన్ ఆవల పడబోతున్న బంతిని చేత్తో ఆపిన కేన్ మామ.. దాన్ని మళ్లీ మైదానంలోకి విసిరే ప్రయత్నం చేశాడు. 
 
అపుడు ఒక కాలిపై ల్యాండ్ కావడంతో అది స్లిప్ అయి కిందపడ్డాడు. దీంతో నొప్పితో విలవిల్లాడిపోయాడు. చివరకు ఫిజియో సాయంతో కుంటుతూ మైదానం వీడాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌ చేయలేకపోయాడు. అతని స్థానంలో స్టాండ్‌బై ఆటగాడు సాయి సుదర్శన్ క్రీజ్‌లోకి వచ్చాడు. మ్యాచ్ అనంతరం కేన్ మామకు జరిపిన వైద్య పరీక్షల్లో గాయం తీవ్రత ఎక్కువగా ఉందని వైద్యులు తేల్చారు. దీంతో ఐపీఎల్ 16వ సీజన్ మొత్తానికి కేన్ మామ దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే, ఈ విషయంపై గుజరాత్ టైటాన్ జట్టు యాజమాన్యం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు