ఐపీఎల్‌లో ఆడాలనుంది.. కానీ ఆసీస్ బోర్డ్ పర్మిషన్ ఇవ్వలేదు: స్టార్క్

శుక్రవారం, 8 జనవరి 2016 (18:34 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ తొమ్మిదో సీజన్లో ఆడాలని ఉందని ప్రముఖ ఆస్ట్రేలియా క్రికెటర్ మిచెల్ స్టార్క్ అన్నాడు. మోకాలి గాయంతో తాజాగా భారత్‌తో జరగనున్న సిరీస్‌కు దూరమైన స్టార్క్ ఏప్రిల్‌లో జరగనున్న ఐపీఎల్‌ 9 సీజన్ కల్లా కోలుకుంటానని క్రికెట్ ఆస్ట్రేలియాకు తెలిపాడు. అయితే స్టార్క్ ఆడేందుకు ఆసీస్ బోర్డు ఎలాంటి అనుమతి మంజూరు చేయలేదని వాపోయాడు. కాగా... ఐపీఎల్‌లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ తరపున మిచెల్ స్టార్క్ ఆడుతున్న సంగతి తెలిసిందే.  
 
గత నవంబర్‌లో కివీస్‌తో ఆడిన సందర్భంగా స్టార్క్ గాయపడ్డాడు. ఈ మ్యాచ్ ముగిసిన అనంతరం స్టిక్స్ సాయంతో మైదానంలోకి అడుగిడిన స్టార్క్‌ను చూసి అభిమానులంతా బాధపడ్డారు. ఇప్పటికే ప్రపంచ కప్ ట్వంటీ-20కి దూరమైన స్టార్క్.. ఐపీఎల్‌లో మాత్రం ఆడాలనుందని చెప్పాడు. అయితే గాయం నుంచి ఏప్రిల్ లోగా గాయం నుంచి కోలుకుని పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తాడో లేదో అనేది వేచిచూడాలి.

వెబ్దునియా పై చదవండి