భారత క్రికెట్‌లో రాజకీయాలెక్కువ.. ప్రేమలో మూడుసార్లు ఫెయిలయ్యా : మిథాలీ రాజ్

శనివారం, 30 సెప్టెంబరు 2017 (12:30 IST)
భారత క్రికెట్‌పై మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేసింది. టీమిండియాలో చాలా రాజకీయాలు ఉన్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. క్రికెట్ జట్టులో చోటుదక్కించుకోవాలంటే కేవలం ప్రతిభ ఉంటే సరిపోదన్నారు. 
 
ఆమె ఓ ప్రైవేట్ టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఈ సంచలన విషయాలను బహిర్గతం చేసింది. క్రికెట్‌లో ప్రతిభ ఉంటే చాలా అవకాశాలు వస్తాయని పలువురు చెబుతుంటారనీ, కానీ ఇది వాస్తవం కాదన్నారు. అయితే క్రికెట్‌లో రాణించాలంటే ప్రతిభ ఒక్కటే సరిపోదని తెలిపింది. టీమిండియాలో చాలా పాలిటిక్స్ ఉంటాయని తెలిపింది. 
 
మహిళా క్రికెట్‌లో కూడా ఉన్నాయని చెప్పింది. కేవలం క్రికెట్ అని మాత్రమే కాదని, ప్రతి రంగంలోనూ రాజకీయాలు ఉన్నాయని తెలిపింది. టీమిండియా ఆటగాళ్లతో హీరోయిన్లు చెట్టాపట్టాలు వేసుకుని తిరిగేలా తమతో ఎవరూ తిరగరని తెలిపింది. తనవరకు అలాంటి అనుభవాలు లేవని చెప్పింది. అయితే, తాను మాత్రం మూడు సార్లు ప్రేమలో విఫలమయ్యానని మిథాలీ రాజ్ వెల్లడించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు