టెస్టు క్రికెట్‌కు మ‌రోసారి రిటైర్మెంట్ ప్రకటించిన మొయిన్ అలీ

మంగళవారం, 1 ఆగస్టు 2023 (19:13 IST)
Moeen Ali
యాషెస్ సిరీస్ ఫైనల్ మ్యాచ్ ముగిసిన అనంత‌రం ఇంగ్లాండ్ ఆల్‌రౌండ‌ర్ మొయిన్ అలీ టెస్టు క్రికెట్‌కు మ‌రోసారి రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడు. వాస్త‌వానికి మొయిన్ అలీ 2021 సెప్టెంబ‌ర్ లో టెస్టుల‌కు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించాడు. కేవ‌లం ప‌రిమిత ఓవ‌ర్ల క్రికెట్ మాత్ర‌మే ఆడుతున్నాడు.  
 
అయితే.. యాషెస్ సిరీస్ 2023కి ముందు ఇంగ్లాండ్ స్పిన్న‌ర్ జాక్‌లీచ్ గాయ‌ప‌డ్డాడు. దీంతో మొయిన్ అలీ రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకున్నాడు. సెలక్టర్లు మొయిన్ అలీని జట్టుకు ఎంపిక చేయడంతో యాషెస్ సిరీస్‌లో ధీటుగా రాణించాడు. 
 
మొత్తం నాలుగు మ్యాచులు ఆడి 180 ప‌రుగులు చేయ‌డంతో పాటు 9 వికెట్లు ప‌డ‌గొట్టాడు. చేతి గాయంతో బాధ‌ప‌డుతున్న‌ప్ప‌టికీ మ్యాచులు ఆడాడు. యాషెస్ సిరీస్ ముగిసిన అనంత‌రం మొయిన్ అలీ మాట్లాడుతూ.. టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టిస్తున్న‌ట్లు తెలిపాడు. సిరీస్‌ను చాలా బాగా ఎంజాయ్ చేశాన‌ని చెప్పుకొచ్చాడు.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు