దటీజ్ ధోనీ... ఫ్యాన్ పాదాభివందనం... తర్వాత... (వీడియో)

గురువారం, 14 డిశెంబరు 2017 (16:22 IST)
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. ఆయనకు వుండే ఫ్యాన్ ఫాలోయింగ్ అంతాఇంతా కాదు. కపిల్ దేవ్ తర్వాత భారత్‌కు ప్రపంచ కప్ అందించిపెట్టిన క్రికెట్ హీరో. అదీ కూడా.. ఒకటి కాదు.. రెండు ప్రపంచ కప్‌లు. 
 
అయితే, జట్టు నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నప్పటికీ ధోనీ క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. దీనికి నిదర్శనమే బుధవారం మొహాలీ వేదికగా శ్రీలంక - భారత్ మధ్య జరిగిన రెండో వన్డేలో జరిగిన ఈ ఘటనే. 
 
రెండో వన్డేలో శ్రీలంక బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ధోనీ అభిమాని ఒకరు భద్రతా వలయాన్ని ఛేదించుకుని మైదానంలోకి పరుగుపెట్టాడు. నేరుగా కీపింగ్ స్థానంలో ఉన్న ధోనీ వద్దకు పరుగెత్తుకుంటూ వచ్చి కాళ్లపై పడి పాదాభివందనం చేశాడు. 
 
అనంతరం తన చేతిలో ఉన్న ఓ అట్టపై ధోనీని ఆటోగ్రాఫ్ పెట్టాల్సిందిగా కోరాడు. అయితే ధోనీ ఆ అభిమానిపై ఏమాత్రం విసుగు చెందకుండా ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. దీంతో మ్యాచ్‌కు కాసేపు అంతరాయం ఏర్పడింది. వెంటనే అక్కడకు చేరుకున్న భద్రతా సిబ్బంది సదరు అభిమానిని అక్కడినుంచి లాక్కెళ్లారు.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు