ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, టీమిండియాకు తిరుగులేని ఆస్తి ధోనీ అని, డ్రెస్సింగ్ రూమ్‌లో ధోని పెద్దన్న లాంటి వాడని ప్రశంసించాడు. ఇప్పటికీ ప్రపంచంలో అత్యుత్తమ వికెట్ కీపర్ ధోనీయే అని, అందరికంటే వేగంగా పరిగెత్తగలడన్నారు.
శ్రీలంకలో ధోనీ ప్రదర్శన ట్రైలర్ మాత్రమేనని, ధోనీ అసలు ఆటను మున్ముందు చూస్తారని చెప్పిన రవిశాస్త్రి, టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలకడం ధోనీకి లాభించిందని, వన్డేలకు మరింత ఫిట్‌గా ఉండేందుకు ఈ నిర్ణయం దోహదపడిందని అన్నారు.
టీమ్ ఇండియా జట్టు ఎంపికకు కొన్ని ప్రమాణాలు ఉన్నాయని, ఆ ప్రమాణాల మేరకు జట్టు ఎంపికకు అర్హులేనని, ఆ తర్వాత జట్టు కూర్పు, ప్లేయర్స్ ఫామ్‌లో ఉండటం అనే అంశాలు పరిగణనలోకి వస్తాయని అన్నారు. యువరాజ్ గురించి సెలెక్టర్లు ఏమనుకుంటున్నారో తనకు తెలియదన్నారు.