సచిన్ బయోపిక్‌పై రజనీకాంత్ ఏమన్నారు..? ఏప్రిల్ 26 కోసం అభిమానుల ఎదురుచూపు

బుధవారం, 19 ఏప్రియల్ 2017 (11:54 IST)
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ బయోపిక్ ‘సచిన్‌: ఎబిలియన్‌ డ్రీమ్స్‌’ ట్రైలర్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ట్రైలర్ చూసిన రజనీకాంత్ సోషల్ మీడియా ఖాతా ద్వారా స్పందించారు. ‘సచిన్‌: ఎబిలియన్‌ డ్రీమ్స్‌’ చిత్రం విజయవంతమవ్వాలని కోరుకుంటున్నానని...గాడ్ బ్లెస్' అని తమిళ సూపర్ స్టార్  రజనీకాంత్ శుభాకాంక్షలు తెలిపారు. జేమ్స్ ఎర్సకైన్ దర్శకత్వం వహించిన ‘సచిన్‌: ఎబిలియన్‌ డ్రీమ్స్‌’ సినిమాకు ఏఆర్.రహమాన్ సంగీతం అందించారు. ఈ సినిమా మే 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.
 
అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో సుదీర్ఘ ప్రయాణం కొనసాగించిన సచిన్ బయోపిక్ కోసం ప్రపంచ క్రికెట్ అభిమానులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. 1989 నుంచి 2013 వరకు అంతర్జాతీయ కెరీర్‌ను కొనసాగించిన సచిన్ ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. ప్రపంచ మేటి క్రికెటర్లలో ఒకడిగా చరిత్ర సృష్టించాడు. తన బయోపిక్ వచ్చేనెల 26న విడుదలవుతుందని ఇప్పటికే సచిన్ ప్రకటించాడు. దీంతో అభిమానుల సందడి మొదలైంది. జేమ్స్ ఎర్స్‌కిన్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాకు ఎఆర్ రెహ్మాన్ సంగీతాన్ని సమకూర్చాడు.

వెబ్దునియా పై చదవండి