ఈ జాబితాలో రోహిత్ తర్వాత ఆసీస్‌పై అత్యధిక సిక్సర్లు కొట్టిన వారిలో ఇయాన్ మోర్గాన్ (63), బ్రెండన్ మెకల్లమ్ (61), సచిన్ టెండూల్కర్ (60), ఎంఎస్ ధోనీ (60) ఉన్నారు.
ఇక, రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్ లో కొట్టిన సిక్సర్ల సంఖ్య 424కి పెరిగింది. మొత్తంగా చూసుకుంటే అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ కంటే ముందు క్రిస్ గేల్, షాహిద్ అఫ్రిది మాత్రమే ఉన్నారు. గేల్ 534 సిక్సులు బాదగా, అఫ్రిది 476 సిక్సర్లు సంధించాడు.