గబ్బర్‌సింగ్‌గా మారిన శిఖర్ ధావన్.. ఫోటోలు వైరల్ (video)

మంగళవారం, 21 మార్చి 2023 (19:24 IST)
Shikhar Dhawan
టీమిండియా స్టార్ ప్లేయర్ శిఖర్ ధావన్ 2010లో విశాఖపట్నంలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో అరంగేట్రం చేశాడు. 100వ వన్డేలో సెంచరీ చేసిన 9వ ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటివరకు 167 వన్డేలు ఆడిన శిఖర్ ధావన్ 6793 పరుగులు చేశాడు. ఇందులో 17 సెంచరీలు, 39 అర్ధసెంచరీలు ఉన్నాయి. వన్డేల్లో 143 పరుగులు చేశాడు. ఇప్పటివరకు 167 వన్డేలు ఆడిన శిఖర్ ధావన్ 6793 పరుగులు చేశాడు. ఇందులో 17 సెంచరీలు, 39 అర్ధసెంచరీలు ఉన్నాయి. వన్డేల్లో 143 పరుగులు చేశాడు. 
 
 గత ఏడాది బంగ్లాదేశ్‌లో పర్యటించిన భారత జట్టు 3 వన్డేల సిరీస్‌తో పాటు 2 టెస్టుల సిరీస్‌ను ఆడింది. ఇందులో వన్డే సిరీస్‌ను 1-2తో కోల్పోయిన భారత్ టెస్టు సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. బంగ్లాదేశ్‌తో జరిగే 3 వన్డేల సిరీస్‌లో శిఖర్ ధావన్‌ని చేర్చారు
 
ఇదే అతడికి చివరి వన్డే మ్యాచ్. భారత్‌లో పర్యటించిన శ్రీలంక, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లలో శిఖర్ ధావన్‌ను కూడా చేర్చలేదు. అయితే ఐపీఎల్ సిరీస్‌లో పంజాబ్ కింగ్స్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. 
 
ఈ స్థితిలో భారత జట్టులో చోటు దక్కించుకోని శిఖర్ ధావన్ బుల్లితెరపై దృష్టి సారించాడు. కుండలి భాగ్య అనేది అభిషేక్ కపూర్ దర్శకత్వం వహించిన టీవీ సిరీస్. ఇది 12 జూలై 2017 నుండి జీ హిందీ టీవీలో ప్రసారం అవుతోంది. ఇందులో శిఖర్ ధావన్ పోలీస్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సిరీస్‌లో తమ షూటింగ్‌ను ముగించిన నటి అంజుమ్ ఫాహీ, దర్శకుడు అభిషేక్ కౌర్, శిఖర్ ధావన్‌లతో కలిసి సోషల్ మీడియాలో ఫోటోలను, వీడియోలను షేర్ చేశారు. 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shikhar Dhawan (@shikhardofficial)

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు