తన కోపమే తన శత్రువు అన్నది పెద్దల మాట. ఎవరైనా కోపగించుకుంటే వారిని చూసి పెద్దలు అంటుంటారు. ఈ సామెత సరిగ్గా సౌతాఫ్రికా క్రికెటర్‌కు సూటైంది. భారత బౌలర్ ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో ఔట్ కావడాన్ని జీర్ణించుకోలేని సౌతాఫ్రికా క్రికెటర్ డ్రెస్సింగ్ రూంకెళ్లి గోడను బలంగా కొట్టి చేతిని విరగ్గొట్టుకున్నాడు. ఫలితంగా మూడో టెస్ట్ మ్యాచ్‌కు దూరమై జట్టుకు కష్టాలు తెచ్చిపెట్టాడు.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ప్రస్తుతం సౌతాఫ్రికా క్రికెట్ జట్టు భారత్‌లో పర్యటిస్తోంది. ఇప్పటికే ఆడిన రెండు టెస్ట్ మ్యాచ్‌లలో ఆ జట్టు చిత్తుగా ఓడిపోయింది. అయితే, రెండో టెస్ట్ మ్యాచ్‌లో సఫారీ ఓపెనర్ ఐడెన్ మార్ క్రమ్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ పేలవంగా అవుటయ్యాడు.
మణికట్టులో పగులు రావడమే కాదు, కొన్ని చేతివేళ్ల ఎముకలు చిట్లినట్టు వైద్య పరీక్షల్లో తేలింది. దాంతో శనివారం ప్రారంభమయ్యే మూడో టెస్టులో మార్ క్రమ్ అందుబాటులో లేకుండా పోయినట్టు సౌతాఫ్రికా మేనేజ్‌మెంట్ వర్గాలు అంటున్నాయి. పైగా, మార్ క్రమ్ చికిత్స కోసం స్వదేశానికి పయనం కానున్నట్టు సమాచారం.