అలాగే 24వ ఓవర్‌లో కెప్టెన్ డుప్లెసిస్(5)ను పెవిలియన్‌కు పంపాడు. అశ్విన్ వేసిన 24 ఓవర్ మూడో బంతి డుప్లెసిస్ బ్యాట్‌కు తగిలింది. ఆ సమయంలో వికెట్లకు దగ్గరగా ఉన్న సాహా చేతుల్లోంచి బంతి చేజారిపోయిందని అనిపించింది. అయితే, తక్కువ ఎత్తులో వచ్చిన బంతి తన చేతుల్లోంచి రెండు సార్లు జారిపోయినా మూడోసారి మాత్రం సాహా ఒడిసి పట్టుకున్నాడు. ఈ క్యాచ్ మ్యాచ్‌కే హైలైట్ అని చెప్పవచ్చు. ఈ క్యాచ్‌తో సాహా అత్యుత్తమ వికెట్ కీపర్ అని మరోసారి నిరూపించుకున్నాడు.
కాగా దక్షిణాఫ్రికా తన తొలి ఇన్నింగ్స్‌లో 275 పరుగుల వద్ద ఆలౌటైన సంగతి తెలిసిందే. అంతకముందు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 601/5 వద్ద డిక్లేర్డ్ చేయడంతో భారత్‌కు 326 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. దీంతో దక్షిణాఫ్రికా ఫాలోఆన్‌లో పడింది. భారత బౌలర్లలో అశ్విన్ 2 వికెట్లు తీయగా, ఇశాంత్, ఉమేశ్ యాదవ్, జడేజాలు చెరో వికెట్ తీశారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా స్కోరు 5 వికెట్ల నష్టానికి 80 పరుగులు. ఇంకా 246 పరుగులు వెనుకబడి ఉంది.