అయితే ఈ స్టేడియం పెవిలియన్ స్టాండ్ కారణంగా యునెస్కో గుర్తింపు పొందిన 17వ శతాబ్దం నాటి కోటకు ముప్పు పొంచి ఉండడంతో దానిని కూల్చివేయాలని శ్రీలంక ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, స్టేడియాన్ని ఇప్పటికిప్పుడు కూల్చబోమని క్రీడల మంత్రి ఫెయిస్‌జెర్ ముస్తాఫా తెలిపారు. ఇక 1505లో శ్రీలంకకు వలస వచ్చిన పోర్చుగీసువారు శ్రీలంక కోటను నిర్మించారు. 1796లో ఈ కోటను బ్రిటిషర్లు స్వాధీనం చేసుకున్నారు.
ఇక గాలె స్టేడియం పెవిలియన్ కారణంగా కోటకు ముప్పు పరిణమించిందని, పెవిలియన్‌ను అనధికారికంగా నిర్మించారని పేర్కొన్నారు. అందుకే గాలె స్టేడియాన్ని కూల్చనున్నట్లు, గాలెలో మరో స్టేడియాన్ని నిర్మించనున్నట్లు మంత్రి చెప్పారు. 2004లో సునామీ కారణంగా స్టేడియం చాలా వరకు ధ్వంసమైంది.