శ్రీలంక వేదికగా ఈ టోర్నీ జరుగనుంది. ప్రతి రెండేళ్లకు ఒకసారి టోర్నమెంట్ను నిర్వహిస్తోండగా... కరోనా వల్ల 2020లో టోర్నీ జరగలేదు. 2021లో జరపాలని తొలుత భావించినా అది సాధ్యపడలేదు. దీంతో 2022 ఆగస్టులో ఈ టోర్నీ నిర్వహణకు రంగం సిద్ధం చేసినట్లు ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రకటించింది.