టీమిండియా క్రికెటర్ సురేష్ రైనా తన మనసులోని మాటను బయటపెట్టాడు. క్రికెట్ అంటే తనకు ప్రాణమని.. అలాగే కుటుంబానికి అంతే ప్రాధాన్యత ఇస్తానని చెప్పుకొచ్చాడు. క్రికెట్, సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే సురేష్ రైనా.. ఓ టీవీషోలో మాట్లాడుతూ తనకు ఒకప్పటి బాలీవుడ్ స్టార్ సోనాలి బింద్రే అంటే చాలా ఇష్టమని పేర్కొన్నాడు. ఆ సొట్టబుగ్గల సుందరితో డేటింగ్ చేయడమంటే ఎంతో ఇష్టమని తెలిపాడు. సోనాలి బింద్రే అందం తనను కట్టిపడేస్తుందని, మైమరపిస్తుందంటూ మనసులో మాట బయటపెట్టాడు.
కాగా టి20 క్రికెట్‌లో 6వేల పరుగులు చేసిన తొలి భారత బ్యాట్స్‌మన్‌గా, మూడు ఫార్మాట్లలో సెంచరీలు చేసిన తొలి భారతీయుడిగా, టీ20, వన్డే ప్రపంచకప్‌లలో సెంచరీలు చేసిన భారతీయుడిగా, 9 ఐపీఎల్ సీజన్లలో 4వేల పరుగులు చేసిన ఒకే ఒక్కడిగా ఇలా ఎన్నో రికార్డులను బద్ధలు కొట్టాడు. కాగా, సురేశ్ రైనాకు తల్లి పర్వీన్, కుమార్తె గ్రేసియా అంటే ప్రాణం. 2015లో ఐటీ ఉద్యోగి ప్రియాంకను పెళ్లాడిన సంగతి తెలిసిందే. కాగా ఆదివారం సురేష్ రైనా 30వ పుట్టినరోజును తన సహచరులతో.. హ్యాపీగా జరుపుకున్నాడు.