కివీస్ టెస్ట్ సిరీస్ కోసం భారత జట్టు ఎంపిక... వివరాలు ఇవే..

శుక్రవారం, 12 నవంబరు 2021 (16:52 IST)
భారత్ - న్యూజిలాండ్ జట్ల మధ్య స్వదేశంలో క్రికెట్ సిరీస్ జరుగనుంది. ఈ నెల 17వ తేదీ నుంచి జరిగే ఈ సిరీస్‌లో భాగంగా తొలుత 2 ట్వంటీ20 మ్యాచ్‌లు జరుగుతాయి. ఆ తర్వాత ఈ నెల 25 నుంచి రెండు టెస్టుల సిరీస్ ప్రారంభమవుతుంది. 
 
ఈ నేప‌థ్యంలో కివీస్‌తో జరిగే టెస్ట్ సిరీస్ కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) జ‌ట్టును ప్ర‌క‌టించింది. అజింక్యా ర‌హానే కెప్టెన్‌గా, పుజారా వైఎస్ కెప్టెన్‌‍గా భార‌త్ తొలి టెస్టు ఆడ‌నున్న‌ారు. 
 
రెండో టెస్టులో కోహ్లీ ఆడ‌తాడ‌ని, జ‌ట్టుకి సార‌థిగా బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తాడ‌ని బీసీసీఐ ప్ర‌క‌టించింది. టీ20 ప్ర‌పంచ క‌ప్‌లో ఘోరంగా ఓట‌మిపాలై టీమిండియా ఇంటికి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. న్యూజిలాండ్ అద్భుత విజ‌యాలు న‌మోదు చేసుకుని ఫైన‌ల్‌లోకి ప్ర‌వేశించింది. ఇక్కడ తమ చిరకాల ప్రత్యర్థి ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ ఫైనల్ ముగిసిన తర్వాత కివీస్ జట్టు భారత్‌కు వస్తుంది. 
 
కివీస్ పర్యటన కోసం ప్రకటించిన జట్టు వివరాలను పరిశీలిస్తే, 
కేఎల్ రాహుల్‌, మ‌యాంక్ అగ‌ర్వాల్, శుభ్‌మ‌న్ గిల్, శ్రేయాస్ అయ్య‌ర్, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీప‌ర్), కేఎస్ భ‌ర‌త్ (వికెట్ కీప‌ర్), ర‌వీంద్ర జ‌డేజా, ర‌విచంద్ర‌న్ అశ్విన్, అక్షర్ పటేల్, జ‌యంత్ యాద‌వ్, ఇషాంత్ శ‌ర్మ‌, ఉమేశ్ యాద‌వ్, సిరాజ్, ప్రసిధ్ కృష్ణ టీమిండియాలు జట్టులో ఉన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు