అబుదాబి వేదికగా ఆదివారం జరిగిన న్యూజిలాండ్ - అఫ్గానిస్తాన్ మ్యాచ్‌కు ముందే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. అబుదాబి క్రికెట్ మైదానం చీఫ్ క్యూరేటర్‌గా సేవలు అందిస్తున్న భారత సంతతికి చెందిన మోహ్ సింగ్ ఆదివారం ఉదయమే పిచ్‌ను పర్యవేక్షించి గ్రౌండ్ సిబ్బందికి సూచనలు అందజేసిన ఆయన ఆతర్వాత తన గదికి వెళ్లిపోయాడు. అయితే ఆ తర్వాత బయటకు రాలేదు. దీంతో అనుమానమొచ్చిన గ్రౌండ్ సిబ్బంది ఆయన గదికి వెళ్లి పరిశీలించగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించారు.
ఉత్తరాఖండ్‌కు చెందిన మోహన్ సింగ్ 2004లో దుబాయికి వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. అంతకుముందు పంజాబ్‌లోని మొహాలీలో ఉన్న పంజాబ్ క్రికెట్ స్టేడియం పిచ్ క్యూరేటర్ (ట్రైనీ)గా సేవలందించారు. దీంతో పాటు గ్రౌండ్ సూపర్ వైజర్, కోచ్, సహాయకుడి బాధ్యతలు కూడా నిర్వర్తించారు.