ఫిబ్రవరి 7, 1999.. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో భారత బౌలింగ్ దిగ్గజం అనిల్ కుంబ్లే టెస్టుల్లో పర్ఫెక్ట్ టెన్ సాధించింది.. ఈ రోజునే. ఈ అద్భుతం జరిగి ఈ రోజుతో 20 సంవత్సరాలు పూర్తయ్యాయి. తన స్పిన్ మాయాజాలంతో పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్లను పెవిలియన్‌కు సాగనంపాడు.
10 వికెట్ల ఘనత ఇంగ్లండ్ బౌలర్ జిమ్ లేకర్ ఖాతాలోనే వుండేది. ఆయన 1956లో పర్ఫెక్ట్ టెన్ సాధించాడు. అది జరిగిన 43 ఏళ్లకు మన కుంబ్లే మళ్లీ అలాంటి ఫీట్ చేసి.. ఈ రికార్డు సృష్టించిన రెండో బౌలర్‌గా క్రికెట్ చరిత్రలో నిలిచాడు. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా తొలి ఇన్నింగ్సులో 252 పరుగుల చేసి ఆలౌట్ అయ్యింది. 420 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్.. మొదట్లో జోరుమీద కనిపించింది.