భారత్‌కు 78వ స్థానం.. ఎందులో తెలుసా?

గురువారం, 31 జనవరి 2019 (11:43 IST)
ప్రపంచ వ్యాప్తంగా అవినీతికి పాల్పడే దేశాల జాబితాను ఓ సంస్థ విడుదల చేసింది. ఇందులో భారత్‌కు 78వ స్థానం లభించింది. వాచ్‌డాగ్ ట్రాన్స్ఫరెన్సీ ఇంటర్నేషనల్ అనే అంతర్జాతీయ స్వచ్ఛంధ సంస్థ.. ప్రభుత్వ కార్యాలయాలు అవినీతి ఆధారంగా లభించిన గణాంకాల ఆధారంగా ఈ సర్వేను నిర్వహించారు. 
 
దీని ఆధారంగా విడుదలైన పట్టికలో సోమాలియా, దక్షిణ సూడాన్, సిరియా వంటి దేశాలు తొలి మూడు స్థానాలను సొంతం చేసుకోగా, గతంలో 81వ స్థానంలో భారత్ మూడు స్థానాలు ఎగబాకి 78వ స్థానాన్ని కైవసం చేసుకుంది. 
 
చైనా 87వ స్థానంలోనూ, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ వంటి దేశాలు 117, 149, 124 స్థానాల్లో కొనసాగుతున్నాయి. అతి తక్కువ అవినీతికి పాల్పడిన దేశాల్లో డెన్మార్క్, న్యూజిలాండ్ వంటి దేశాలు ఒకటి రెండు స్థానాల్లో వున్నాయి. ఈ జాబితాలో అమెరికా 22వ స్థానానికి వెనక్కి నెట్టేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు