కోహ్లీకి కెప్టెన్సీ ఇచ్చేస్తానన్న రవిశాస్త్రి: జూన్‌లోపు కోచ్ ఎంపికన్న ఠాకూర్!

మంగళవారం, 31 మే 2016 (15:59 IST)
భారత సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా తానుంటే.. టీమిండియా స్టార్ ప్లేయర్.. విరాట్ కోహ్లీకి వన్డేలు, ట్వంటీ-20ల్లోనూ టీమిండియాకు నాయకత్వం అప్పగించేస్తానని చెప్పాడు. మూడు ఫార్మాట్లకు కెప్టెన్సీ వహించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని రవిశాస్త్రి అభిప్రాయం వ్యక్తం చేశాడు. 
 
తన కామెంట్స్‌కు అర్థం ధోనీ నుంచి కెప్టెన్సీ లాగేసుకోవడం కాదని రవిశాస్త్రి క్లారిటీ ఇచ్చాడు. ధోని ఆటగాడిగా తన సేవల్ని కొనసాగించవచ్చు. ఆటను ఆస్వాదించవచ్చు. కోహ్లి అన్ని ఫార్మాట్లలోనూ కెప్టెన్సీకి సిద్ధంగా ఉన్నాడు. తాను ఛైర్మన్ అయితే బాధ్యతలు అప్పగిస్తానని రవిశాస్త్రి తెలిపాడు. కోహ్లీ 3 ఫార్మాట్లలో నాయకత్వ పగ్గాలు చేపట్టేందుకు ఇదే సరైన సమయమని రవిశాస్త్రి వెల్లడించాడు. 
 
మరోవైపు జూన్ నెలాఖరులోపు టీమిండియాకు కొత్త కోచ్‌ను నియమిస్తామని బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్‌ ఠాకూర్‌ తెలిపారు. భారత జట్టుకు కోచ్‌ ఎంపిక ప్రక్రియ కొనసాగుతోందని ఠాకూర్ వ్యాఖ్యానించారు. జూన్‌లోపు ఆ ప్రక్రియ ముగుస్తుందన్నారు.

వెబ్దునియా పై చదవండి