సాధారణంగా సింహాన్ని చూస్తే ఆమడ దూరం పారిపోతుంటాం. కానీ ఓ బైకర్ మాత్రం సింహం తన ముందు అలా నడుస్తూ వెళ్తున్నా పెద్దగా పట్టించుకోలేదు. సింహమే కదా అంటూ తన బండిని తాను నడుపుకుంటూ వెళ్లిపోయాడు. తాజాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ వీడియో రోడ్డుకు ఇరువైపుల చెట్లతో కూడినదిగా కనిపిస్తోంది. ఈ రోడ్డుపై వెళ్తున్న బైకర్‌కు సింహం కనిపించింది. రోడ్డును దాటుకుని సింహం వెళ్తున్నా. ఆ బైకర్ దాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా బండిని నడుపుతూ.. బండిని పక్కకు తిప్పుకుని వెళ్లిపోయాడు. ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు ఆ బైకర్‌పై ప్రశంసలు గుప్పిస్తున్నారు.
ఆ బైకర్ సింహాన్ని కుక్కనుకున్నాడా ఏంటి ప్రశ్నిస్తున్నారు. ఏమి గుండెరా బాబు అంటూ కామెంట్లు చేస్తున్నారు. సింహాన్ని చూస్తే గుండె ఆగిపోయే పనవుతుంది అలాంటిది ఆ బైకర్ ఏమాత్రం భయపడకుండా సైలెంట్‌గా వెళ్తున్నాడే అంటూ కామెంట్లు చేస్తున్నారు.
బ్రో
పులనుకున్నావా?
కుక్కనుకున్నావా?
ఏమి గుండెరా బాబు, స్కాన్ చేసి పంపించు..???? pic.twitter.com/B56H1GjNrt