ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ ఆటగాడు, కెప్టెన్ విరాట్ కోహ్లీ మరోసారి అగ్రస్థానంలో నిలిచాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు కోహ్లీ మూడో స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం ర్యాకింగ్స్‌లో సౌతాఫ్రికా బ్యాట్స్‌మన్ ఏబీ డీ విల్లియర్స్, ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్‌లను వెనక్కునెట్టేశాడు.
ప్రస్తుతం కోహ్లీ వన్డే ర్యాంకింగ్స్‌లో 861 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, డేవిడ్ వార్నర్. కోహ్లీ కంటే ఒకే ఒక్క పాయింట్ వెనకబడి 861 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక ఏబీ డీ విల్లియర్స్ 847 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు.
ఇదిలా ఉంటే.. భారత క్రికెట్ జట్టు కెప్టెన్, వన్డేల్లో నంబర్ వన్ ఆటగాడు విరాట్ కోహ్లీ మరో భారీ డీల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. భారీ మొత్తం చెల్లించి కోహ్లీతో డీల్ కుదుర్చుకోవాలని పెప్సీకో ఇంకా తన ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ఇటీవలే పెప్సీకోతో తన ఒప్పందాన్ని తెంచుకున్నానని కోహ్లీ ప్రకటించాడు. తాను వినియోగించని శీతల పానీయాలకు ప్రచారం చేయలేనని కోహ్లీ తెగేసి చెప్పిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో 8 సంవత్సరాల కాలానికి తమ ఉత్పత్తులను ప్రచారం చేసి పెట్టేందుకు ప్రముఖ టైర్ల సంస్థ ఎంఆర్ఎఫ్ కోహ్లీతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది.