'ఖేలో ఇండియా' క్రీడలకు ఓ ఉత్ప్రేరకంలాంటిది : మోడీకి కోహ్లీ ట్వీట్

గురువారం, 21 సెప్టెంబరు 2017 (15:01 IST)
దేశంలో క్రీడారంగంలో మౌలిక సదుపాయాల రూపకల్పనతో పాటు... వివిధ రకాల అభివృద్ధి పనుల కోసం కేంద్ర ప్రభుత్వం "ఖేలో ఇండియా" పేరుతో ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీన్ని కేంద్ర క్రీడల మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ ప్రారంభించారు. 
 
ఇప్పటివరకు కేవలం మౌలిక సదుపాయాలపైనే దృష్టిసారించిన ఈ కార్యక్రమం ఇక నుంచి అన్ని విధాలా అభివృద్ధే లక్ష్యంగా సాగనుంది. దీనికోసం వచ్చే మూడేళ్లకుగాను రూ.1756 కోట్లను కేంద్రం ప్రభుత్వం కేటాయించింది. 
 
రాజీవ్‌ గాంధీ ఖేల్ అభియాన్, అర్బన్ స్పోర్ట్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ స్కీమ్, నేషనల్ స్పోర్ట్స టాలెంట్ సెర్చ్ ప్రోగ్రామ్‌లను కలిపేసి కొత్తగా ఖేలో ఇండియాను తీసుకొచ్చారు. దేశంలో అత్యున్నత క్రీడాకారులను తయారు చేసే 20 యూనివర్సిటీలను ఎంపిక చేసి వాటికి మరిన్ని నిధులు కేటాయించనున్నారు. 
 
ఈకొత్త కార్యక్రమంపైనే భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించాడు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, క్రీడా మంత్రి ప్రారంభించిన ఈ కార్యక్రమం ఖచ్చితంగా భారత్‌లో క్రీడలకు ఉత్ప్రేరకంగా పనిచేస్తుందని విరాట్ ట్వీట్ చేశాడు.

 

'Khelo india' a much awaited initiative by our hon'ble PM & SportsMinister.Surely this will catalyse sports in India.@narendramodi @Ra_THORe https://t.co/vpQkBmrdK0

— Virat Kohli (@imVkohli) September 20, 2017

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు