మరోవైపు భారత జట్టు మాత్రం ఎలాంటి ప్రాక్టీస్ మ్యాచ్ లేకుండానే న్యూజిలాండ్‌తో పోరుకు సిద్ధమైంది. కేవలం ఇంట్రా స్క్వాడ్ ప్రాక్టీస్, నెట్ సెషన్స్‌తోనే సమాయత్తం అవుతోంది. ఇది భారత్‌కు నష్టం చేస్తుందని మాజీ క్రికెట్లరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే కీలక మ్యాచ్‌కు ముందు సిరీస్ విజయం ప్రత్యర్థికి అడ్వాంటేజ్ అయినప్పటికీ.. ఫైనల్ గెలిచే సత్తా భారత్‌కు ఉందని కూడా అంటున్నారు.
ఇక భారత ఆటగాళ్లు మాత్రం ఇవేం పట్టనట్లు ప్రాక్టీస్‌పైనే దృష్టిసారించారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అయితే నెట్స్‌లో చెమటోడుస్తున్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు రూపొందించే పిచ్ పేస్, బౌన్స్‌కు అనుకూలంగా ఉంటుందని ఏజెస్ బౌల్ క్యూరేటర్ సైమన్ లీ చెప్పడంతో కోహ్లీ ఆ దిశగా సమాయత్తం అవుతున్నాడు. న్యూజిలాండ్‌లో పొడగరి బౌలర్లను ధీటుగా ఎదుర్కొనేందుకు బౌన్స్, షార్ట్ పిచ్ బంతులను ప్రాక్టీస్ చేస్తున్నాడు.