విరాట్ కోహ్లీ ఫేవరేట్ హీరో పేరేంటో తెలుసా?

శుక్రవారం, 13 ఏప్రియల్ 2018 (16:34 IST)
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫేవరెట్ హీరో ఎవరో తెలిసిపోయింది. ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నకు టీమిండియా మాజీ క్రికెటర్, క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కరే తన ఫేవరేట్ హీరో అని స్వయంగా తెలిపాడు. బెంగళూరులో ఓ కార్యక్రమంలో పాల్గొన్న కోహ్లీ.. తన ఫేవరేట్ హీరో అంటే సినిమా హీరోల పేరు చెప్పకుండా.. సచిన్ పేరు చెప్పడంతో ఆ ప్రాంగణమంతా చప్పట్లతో మారుమోగిపోయింది. 
 
తాను వారాంతంలో సరదాగా గడిపేందుకు తనకు అవకాశం దొరికితే ఇంట్లో ఉండి రిలాక్స్‌ అవుతానని కోహ్లీ చెప్పాడు. లేకపోతే.. తన ఫేవరేట్‌ కారులో సంగీతం వింటూ డ్రైవింగ్‌ చేస్తానని చెప్పాడు. 
 
మరోవైపు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వరుసగా రెండో ఏడాది విజ్డన్ లీడింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యాడు. అలాగే విమెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు భారత మహిళల జట్టు సారథి మిథాలీ రాజ్‌ సొంతం చేసుకుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు