టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వల్ల రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యానికి తీవ్ర నష్టం వాటిల్లింది. ఎందుకంటే.. బాలీవుడ్ సుందరి దీపికా పదుకునేతో నటించేందుకు కోహ్లీ నో చెప్పాడట. దీంతో ఐపీఎల్ జట్టు ఆర్సీబీకి రూ.11 కోట్ల నష్టం ఏర్పడింది. బెంగళూరు ఐపీఎల్ జట్టు కాంట్రాక్టు ప్రకారం కోహ్లీ ఇతర సెలబ్రిటీతో యాడ్ షూటింగ్‌లో పాల్గొనకూడదు.
మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రెండేళ్ల నిషేధానికి తర్వాత ఈ ఏడాది జరిగే ఐపీఎల్‌లో బరిలో దిగనుంది. ఇందులో భాగంగా చెన్నైలో తొలి ప్రాక్టీస్ సెషన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ దేశవాళీ ఆటగాళ్లు పాల్గొన్నారు. విదేశీ ఆటగాళ్లు ఆయా దేశాల టోర్నీలు ముగియగానే జట్టుతో చేరుతారు. ఏప్రిల్ 10న చెన్నై సూపర్ కింగ్స్ తొలి మ్యాచ్ ఆడనుంది. ప్రాక్టీస్ కు ధోనీతో పాటు జట్టు యజమాని శ్రీనివాసన్ కూడా హాజరయ్యారు.