కొంత ఉపశమనం కోసం కుర్చీపై కూర్చుని ఐస్ ప్యాక్‌లను కూడా అడిగాడు. ఆటలో విరామ సమయంలో, విరాట్ కోహ్లి ఆస్ట్రేలియా బ్యాటర్ మార్నస్ లాబుస్‌చాగ్నే ముందు చిన్న డ్యాన్స్ చేస్తూ కనిపించాడు. భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
ఈ సిరీస్‌లోని మొదటి రెండు మ్యాచ్‌లకు విశ్రాంతి తీసుకున్న భారత కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కుల్దీప్ యాదవ్‌లతో మళ్లీ జట్టులోకి వచ్చారు. ఇక, రవిచంద్రన్ అశ్విన్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ ఎంపికయ్యాడు. ఇషాన్ కిషన్ కూడా వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నందున తప్పుకున్నాడు.
కెప్టెన్ కమిన్స్, మిచెల్ స్టార్క్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్‌లతో ఆస్ట్రేలియా వారి XIలో ఐదు మార్పులు చేసింది. స్పిన్నర్ తన్వీర్ సంఘా అరంగేట్రం చేయనున్నాడు. తొలి రెండు వన్డేల్లో విజయం సాధించిన భారత్ 2-0తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది.
జట్లు:
భారత్: రోహిత్ శర్మ (సి), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (డబ్ల్యు), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్
ఆస్ట్రేలియా: మిచెల్ మార్ష్, డేవిడ్ వార్నర్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లాబుస్చాగ్నే, అలెక్స్ కారీ(w), గ్లెన్ మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, పాట్ కమిన్స్(సి), మిచెల్ స్టార్క్, తన్వీర్ సంఘా, జోష్ హేజిల్‌వుడ్.