భారత్-వెస్టిండీస్‌ల మధ్య జరుగుతున్న తొలి టీ-20 మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టి 20 లో టీం ఇండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కెప్టెన్ కోహ్లి భారీ అర్ధ సెంచరితో (94) రాణించడంతో టీమిండియా ఘన విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కి దిగిన విండీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 207 పరుగుల భారీ స్కోర్ సాధించింది.
తదనంతరం భారీ లక్ష్య చేధనతో బరిలోకి దిగిన టీమిండియా… మూడో ఓవర్ రెండో బంతికే ఓపెనర్ రోహిత్ శర్మ వికెట్ కోల్పోయింది. 10 బంతుల్లో ఒక ఫోర్ సాయంతో 8 పరుగులు చేసిన రోహిత్ పెర్రి బౌలింగ్‌లో హేట్మేయర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అ తర్వాత మరో ఓపెనర్ కెఎల్ రాహుల్‌తో కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డాడు.