టీమిండియా స్టార్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ కరోనా పాజిటివ్‌గా తేలడంతో టీమ్‌తో కలిసి ఇంగ్లాండ్ ఫ్లైట్ ఎక్కకుండా స్వదేశంలోనే ఉండిపోయాడు. తాజాగా భారత మాజీ సారథి విరాట్ కోహ్లీ సహా శుబ్‌మన్ గిల్, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్, కెఎస్ భరత్ వంటి టీమ్‌మేట్స్ కలిసి ఇంగ్లాండ్ చేరుకున్నాడు.
మాల్దీవుల్లో హాలీడేస్ ఎంజాయ్ చేసిన తర్వాత జట్టుతో కలిసి ఇంగ్లాండ్ చేరుకున్న తర్వాత విరాట్ కోహ్లీ కూడా కరోనా పాజిటివ్‌గా తేలినట్లు తెలిసింది. ఆ తర్వాత కరోనా నుంచి కోలుకున్న విరాట్, ప్రస్తుతం టీమ్‌తో కలిసి ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొంటున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే విరాట్ కోహ్లీ మాత్రం తనకు కరోనా సోకినట్టు ఎక్కడా తెలియచేయలేదు. సోషల్ మీడియాలో జిమ్‌లో వ్యాయామాలు చేస్తున్న ఫోటోలను, ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొంటున్న ఫోటోలను షేర్ చేశాడు. దీంతో విరాట్ కోహ్లీకి కరోనా సోకినట్టు వచ్చిన వార్తలు నిజమేనా? లేక పుకార్లు మాత్రమేనా? అనేది తేలాల్సి ఉంది.