కరోనా ఉధృతి... 4 నెలల తర్వాత .. వారం వ్యవధిలో 80 వేల కేసులుే

సోమవారం, 20 జూన్ 2022 (10:37 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిలో వేగం క్రమంగా పుంజుకుంటుంది. ఫలితంగా గత వారం రోజుల వ్యవధిలో 80 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు కావడం గత నాలుగు నెలల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. 
 
కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల మేరకు గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా మొత్తం 2,96,050 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా, 12781 మందికి కరోనా వైరస్ సోకినట్టు తేలింది. ఇందులో మహారాష్ట్రలో 4004, ఢిల్లీలో 1530, కేరళలో 2786 కొత్త కేసులు వెలుగు చూశాయి. 
 
అలాగే, కరోనా రోజువారీ పాజిటివిటీ రేటు 4.32 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 18 మంది చనిపోయారు. ఈ మరణాలతో కలుపుకుంటే మొత్తం మృతుల సంఖ్య 5,24,873గా ఉంది. ఈ వైరస్ నుంచి 8537 మంది కోలుకున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు