సెలక్టర్ కావాలనుంది.. కానీ అవకాశం ఇచ్చేదెవరు?: సెహ్వాగ్

మంగళవారం, 13 ఆగస్టు 2019 (17:29 IST)
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కోచ్ ఎంపిక పనుల్లో పడిన నేపథ్యంలో టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మనసులోని మాటను వెలిబుచ్చాడు. తనకు సెలక్టర్‌ కావాలనుందని ట్వీట్ చేయడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత సెహ్వాగ్ ట్విట్టర్‌లో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. 
 
తాజాగా ట్విట్టర్లో తనకు సెలెక్టర్ కావాలనుందని.. కానీ అవకాశం ఇచ్చేదెవరు? అని కామెంట్ పోస్టు చేశాడు. సాధారణంగా సెహ్వాగ్ తన ట్విట్టర్ ఖాతాలో ఎక్కువగా సరదా సందేశాలే పెడుతుంటాడు కాబట్టి.. ఈ ట్వీట్‌ ఉద్దేశమేంటన్నది తెలియాల్సి వుంది.
 
ఇకపోతే.. వన్డే ప్రపంచకప్‌ కోసం జట్టు ఎంపిక‌పై భారత సెలక్టర్ల తీరుని ఇప్పటికే మాజీ క్రికెటర్లు ఎండగడుతున్నారు. ఇక మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అయితే మరో అడుగు ముందుకేసి.. కుంటి బాతు తరహాలో సెలక్టర్ల నిర్ణయాలు ఉన్నాయని ఎద్దేవా చేశాడు. దీంతో ఈసారి సెలక్టర్లని మార్చే యోచనలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు