భారత క్రికెట్ జట్టు జింబాబ్వే దేశ ప్రర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్‌లో మూడు వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. ఈ నెల 27వ తేదీ నుంచి ఆసియా కప్ మొదలుకానుంది. ఈ సిరీస్ ప్రారంభానికి ముందే టీమిండియా జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. ఈ సిరీస్‌లో భాగంగా ఆగస్టు 18, 20, 22 తేదీల్లో జింబాబ్వేతో మూడు వన్డే మ్యాచ్‌లు ఆడనుంది.
జాతీయ క్రికెట్ అకాడమీ ఛైర్మన్ వీవీఎస్ లక్ష్మణ్ కోచ్ అవతారమెత్తారు. త్వరలో జింబాబ్వేలో పర్యటించే టీమిండియాకు లక్ష్మణ్ కోచ్‌గా వ్యవహరించనున్నాడు. ఈ పర్యటనలో టీమిండియా, జింబాబ్వే జట్టుతో 3 వన్డేలు ఆడనుంది.
ఆసియా కప్‌లో పాల్గొనే ఆటగాళ్లలో కేఎల్ రాహుల్, దీపక్ హుడా మాత్రమే జింబాబ్వే టూరులో పాల్గొంటున్నారని, మిగతా టీ20 జట్టంతా రాహుల్ ద్రావిడ్ నేతృత్వంలో ఆసియాకప్‌కు సన్నద్ధమవుతుందని జై షా వివరించారు. ద్రావిడ్ ప్రధాన జట్టుతో పాటే ఉంటాడని తెలిపారు.