అమ్మ చేసే చేపలు, రొయ్యల కూరంటే ఇష్టం: చైనీస్ ఫుడ్ కోసం వెళ్తే.. సచిన్

సోమవారం, 23 అక్టోబరు 2017 (12:00 IST)
అమ్మ చేసే చేపలు, రొయ్యల కూరంటే ఇష్టమని.. తనకోసం తన తల్లి వాటిని ప్రత్యేకంగా తయారు చేసేదని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అన్నాడు. తన బాల్యంలో చోటుచేసుకున్న ఆసక్తికర సంఘటన గురించి సచిన్ ఆటోబయోగ్రఫీని 'ప్లేయింట్ ఇట్ మై వే' పేరిట పుస్తకాన్ని తీసుకొచ్చిన 'హచ్చాటే' సంస్థ తాజాగా సచిన్ బాల్యంలోని సంగతులతో 'ఛేంజ్ యువర్ డ్రీమ్స్' పేరిట పుస్తకాన్ని తీసుకొచ్చింది. అందులో తొమ్మిదేళ్ల వయసులో ఎంతో ఇష్టంగా రుచి చూడాలని భావించాడు. అయితే సచిన్‌కు చేదు అనుభవాన్నే మిగిల్చిందని తెలిపారు. 
 
ముంబైలో 1980లలో చైనీస్‌ ఫు‌కు అప్పుడప్పుడే ఆదరణ పెరుగుతోంది. ఈ చైనీస్ ఫుడ్ గురించి సచిన్‌కు తెలిసింది. దీంతో స్నేహితులకు దానిని రుచి చూడాలని భావించారు. ఇందుకోసం డబ్బు కూడకట్టుకుని రెస్టారెంట్ వెళ్లారు, అయితే చైనీస్ ఫుడ్ తింటున్నామన్న ఆనందంతో పెద్ద  టేబుల్ దగ్గరకూర్చున్నారు. అందర్లోకి చిన్నవాడు కావడంతో సచిన్‌ను టేబుల్ చివరన కూర్చోబెట్టారు.
 
తొలుత చికెన్‌, స్వీట్‌ కార్న్‌ సూప్‌‌ను ఆర్డర్‌ చేశారు. తరువతా ఫ్రైడ్ రైస్, నూడుల్స్ ఇలా అన్నీ పెద్ద బౌల్ నిండా వచ్చేవి. అయితే అందరూ పెద్ద వాళ్లు కావడానికి తోడు, టేబుల్ చివరన సచిన్ ఉండడంతో సచిన్ వరకు వచ్చేసరికి బౌల్స్ ఖాళీ అయిపోయేవి. ఒకటి రెండు స్పూన్లు మాత్రమే మిగిలేవని సచిన్ చెప్పుకొచ్చారు. అలా చైనీస్ ఫుడ్ టేస్ట్ చేయకుండా ఇంటికొచ్చానని సచిన్ ఆ పుస్తకంలో పేర్కొన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు