భారత క్రికెటర్ జహీర్ ఖాన్ తన 38 యేళ్ల బ్యాచిలర్ లైఫ్‌కు స్వస్తి చెప్పాడు. 'చెక్‌దే' ఫేం నటి సాగరిక ఘట్గేతో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు. నిజానికి గత కొంతకాలంగా వీరిద్దరు ప్రేమాయణం కొనసాగిస్తూ వచ్చిన విషయం తెల్సిందే. ఇపుడు ఆమెతోనే ఎంగేజ్‌మెంట్ చేసుకున్నట్టు ప్రకటించి జహీర్ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు.
ఈ సందర్భంగా సాగరితో కలిసి ఉన్న ఒక ఫొటోను జహీర్ ఖాన్ అభిమానులతో పంచుకున్నాడు. అందులో సాగరిక తన వేలికి ఉన్న ఉంగరాన్ని చూపిస్తూ ఫొటోకు పోజిచ్చింది. ఈ ఫోటో కింద ట్వీట్స్ చేశాడు. 'మీ భార్య ఎంపికల్ని చూసి నవ్వకండి. ఎందుకంటే మీరు కూడా అందులో భాగమే. ఇక నుంచి జీవితాంతం భాగస్వాములమే' అని సాగరిక చేతికి ఉంగరం పెట్టిన పెట్టిన ఫోటోను జహీర్ ఖాన్ ట్వీట్ చేశాడు. దీనికితోడు 'ఎంగేజ్‌మెంట్ అయింది' అనే హ్యాష్ ట్యాగ్‌ను ఈ ట్వీట్‌కు జోడించాడు.