ఇంగ్లండ్‌తో మూడో వన్డే: 6 వికెట్ల తేడాతో శ్రీలంక విజయభేరి!

ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలోనూ శ్రీలంక విజయభేరి మోగించింది. ఆదివారం జరిగిన మూడో వన్డేలో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 246 పరుగులు చేసింది.

కెప్టెన్ అలిస్టార్ కుక్ 119 పరుగులతో రాణించగా, పీటర్సన్ 41, ఇయాన్ బెల్ 30 పరుగులు చేశారు. లంక బౌలర్లలో మలింగ, లక్మల్, అజంతా మేండిస్‌లకు తలా రెండు వికెట్లు లభించాయి.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన లంక 21 పరు గుల వద్ద కెప్టెన్ తిలకరత్నే దిల్షాన్ (3) వికెట్‌ను చేజార్చుకుంది. అయతే, మహే ల జయవర్ధనే, చండీమల్ జట్టును ఆదుకున్నారు. 112 పరుగుల భాగస్వామ్యా న్ని అందించడంతో లంక ఊపిరి పీల్చుకుంది.

జయవర్ధనే 77 బంతుల్లో 79 ప రుగులు చేసి, డెర్న్‌బ్యాచ్ బౌలింగ్‌లో మోర్గాన్‌కు దొరికిపోయాడు. కుమార సంగక్కర 25, కండాంబి 11 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. 230 పరుగుల వద్ద లంక నాలుగో వికెట్ కోల్పోయింది.

ఇంగ్లండ్ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొన్న చండీమల్ జట్టు విజయం కీలక పాత్ర పోషించాడు. అతనికి సెంచరీ పూర్తిచేసే అవకాశాన్ని కల్పించే ఉద్దేశంతో ఏంజెలొ మాథ్యూస్ నింపాదిగా ఆడాడు. ఈ క్రమంలో 123వ బంతిని సిక్స్‌గా మలచిన చండీమల్ సెంచరీ పూర్తి చేశాడు.

తద్వారా 48.2 ఓవర్లలో లంక 249 పరుగులతో లక్ష్యాన్ని చేధించింది. చివరికి చండీమల్ 105, మాథ్యూస్ ఒక పరుగుతో నాటౌట్‌గా నిలిచారు. తద్వారా శ్రీలంక ఆరు వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై విజయఢంకా మోగించింది.

వెబ్దునియా పై చదవండి