ఛాంపియన్స్ ట్రోఫీ: ఆస్ట్రేలియా-కివీస్ తుదిపోరు నేడే

సోమవారం, 5 అక్టోబరు 2009 (09:28 IST)
దక్షిణాఫ్రికా గడ్డపై జరుగుతున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ సోమవారం జరుగనుంది. సెంచూరియన్ పార్కులో జరిగే ఈ మ్యాచ్ డే అండ్ నైట్‌గా సాగుతుంది. మొత్తం 14 రోజుల పాటు సాగిన ఈ హోరాహోరీ పోరుకు నేటితో తెరపడనుంది. సుమారు రూ.19 కోట్ల ప్రైజ్‌మనీతో మినీ ప్రపంచకప్‌గా ఈ టోర్నీని అభివర్ణిస్తారు.

ఈ ఫైనల్ పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా, మాజీ ఛాంపియన్ న్యూజిలాండ్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ముఖ్యంగా, ప్రపంచ నెంబర్‌వన్‌ ర్యాంకు కోసం పోటీపడుతున్న ఆస్ట్రేలియా... ఈ మ్యాచ్‌లో గెలుపొందడం ద్వారా ఆ ర్యాంకును తిరిగి చేజిక్కించుకోనుంది.

యాషెస్ సిరీస్ ఓటమి నుంచి త్వరలోనే కోలుకున్న ఆస్ట్రేలియా జట్టు ఆ తర్వాత జరిగిన నాట్‌వెస్ట్ సిరీస్‌లో ఆతిథ్య ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. ఆ తర్వాత జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో తనదైన శైలిలో కంగారులు రెచ్చిపోయారు. అలాగే, కివీస్ ఆటగాళ్లు కూడా టోర్నీ ఆరంభం నుంచి సంచలనాలు నమోదు చేస్తూ ఫైనల్‌కు చేరుకున్నారు. దీంతో ఈ పోరు ఆసక్తికరంగా సాగనుంది.

ఇరు జట్ల వివరాలు:
ఆస్ట్రేలియా:- పాంటింగ్‌ (కెప్టెన్‌), హస్సీ, ఫెర్గ్యూసన్‌, హౌర్జిట్‌, హిల్ఫ్‌నాస్‌, జేమ్స్‌ హోప్స్‌, మైకేల్‌ హస్సీ, మిచెల్‌ జాన్సన్‌, బ్రెట్‌ లీ, ఫయినీ, సిడిల్‌, వోగిస్‌, వాట్సన్‌, వైట్‌, హడ్డిన్‌, బొలింగర్‌

న్యూజిలాండ్‌:- వెటోరి (కెప్టెన్‌), షేన్‌బాండ్‌, నీల్‌ బ్రూమ్‌, బట్లర్‌, హోప్కిన్‌, డెమంతి, గ్రాంట్‌ ఇలియట్‌, మార్టిన్‌ గుప్తిల్‌, మెక్‌కలమ్‌, మిల్స్‌, రెడ్మండ్‌, ఫ్రాంక్లిన్‌, జితిన్‌ పటేల్‌, రాస్‌ టేలర్‌, టఫీ.

వెబ్దునియా పై చదవండి