డే అండ్ నైట్ టెస్టుల నిర్వహణపై ఐసీసీ చర్చ!

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కమిటీ సోమవారం దుబాయ్‌లో భేటీ కానుంది. ఈ భేటీలో డే అండ్ నైట్ టెస్టుల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై ప్రధానంగా చర్చ జరుపుతారు. ట్వంటీ-20కి పెరుగుతున్న ఆదరణ దృష్ట్యా టెస్టులు, వన్డే మ్యాచ్‌లను భవితవ్యంపై కూడా చర్చిస్తారు.

అలాగే అంపైర్ రెఫరల్ విధానంపై కూడా సమీక్ష జరుపుతారు. తొమ్మిది నెలల క్రితం నాలుగు టెస్టుల్లో రెఫరల్ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేశారు. ఈ విధానాన్ని పొడగించాలా వద్దా అనే అంశంపై ఐసీసీ కమిటీ తుది నిర్ణయం తీసుకుంటారు.

ముఖ్యంగా.. ట్వంటీ-20 క్రికెట్‌కు లభిస్తున్న విపరీతమైన ఆదరణ పట్ల సంప్రదాయక టెస్టులను రక్షించే నిమిత్తం డే అండ్ నైట్ టెస్టుల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై ఐసీసీ చర్చిస్తుంది.

వెబ్దునియా పై చదవండి