దేశం కోసం ఐపీఎల్ మ్యాచ్‌లకు దూరం..!: సిడిల్

FILE
ప్రతిష్టాత్మక ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-3లో తాను ఆడట్లేదని ఆస్ట్రేలియా పేసర్ పీటర్ సిడిల్ స్పష్టం చేశాడు. తన దేశం (ఆస్ట్రేలియా) కోసం జరిగే మ్యాచ్‌ల్లో ఆడటంపై అధిక శ్రద్ధ చూపుతానని ఆస్ట్రేలియన్ అసోసియేటెడ్ ప్రెస్‌తో సిడిల్ అన్నాడు.

ఆస్ట్రేలియా కోసం ఆడటం కోసమే ఐపీఎల్ మ్యాచ్‌లలో పాల్గొనే అవకాశాన్ని చేజార్చుకుంటున్నానని సిడిల్ పేర్కొన్నట్లు ఆస్ట్రేలియన్ అసోసియేటెడ్ ప్రెస్ తన ప్రచురణలో తెలిపింది. ప్రస్తుతానికి ఆస్ట్రేలియా తరపున రాణించడమే తన లక్ష్యమని, ఇంకా రెండెళ్లపాటు ఆసీస్ తరపున అంతర్జాతీయ క్రికెట్లో ధీటుగా ఆడాలని భావిస్తున్నట్లు సిడిల్ చెప్పాడు.

దీంతో జాతీయ జట్టుకోసం సిడిల్ ఐపీఎల్‌కు దూరం కావడంపై క్రికెట్ అభిమానులు నిరాశకు గురయ్యారు. ఇంకా ఐపీఎల్ మ్యాచ్‌లో అద్భుత క్రీడాకారుడి ఆటతీరును వీక్షించే అవకాశాన్ని అభిమానులు కోల్పోయారని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. ఇదిలా ఉంటే.. 25 ఏళ్ల యువ పేస్ బౌలర్ పీటర్ సిడిల్ ఇప్పటి వరకు 16 టెస్టులు, 12 వన్డేల్లో ఆడాడు.

వెబ్దునియా పై చదవండి